సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకారు.. కొట్టిపారేసిన సినీనటి రాధిక
- రాధిక బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారంటూ పుకారు
- తమిళనాట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం
- నిక్షేపంగా ఉన్నానని చెప్పిన రాధిక
తాజాగా సీనియర్ నటి రాధికకు సంబంధించి ఓ తప్పుడు ప్రచారం జరుగుతోంది. రాధిక గత కొంత కాలంగా కేన్సర్ తో బాధపడుతున్నారనేదే ఆ వార్త. క్యాన్సర్ కారణంగా ఆమె బయట కూడా కనిపించడం లేదనే పుకారు సోషల్ మీడియా ద్వారా తమిళనాట వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి ఓ అభిమాని ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా రాధికను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన ఆమె... అదంతా తప్పుడు ప్రచారమేనని, తాను నిక్షేపంగా ఉన్నానని తెలిపారు.