వితంతువును వివాహమాడే యుగపురుషుడిలా మా ఇంటికి రా... భర్త హత్యకు ముందు ప్రియుడితో సరస్వతి!
- హత్య తరువాత ఇంటికి వస్తే పెళ్లికి ఒప్పుకుంటారు
- లేచిపోతే ఎప్పటికీ అంగీకరించరు
- భర్త హత్యకు శివను ఒప్పించేముందు సరస్వతి
ఇద్దరిదీ ఒకే కులం కావడంతో ఇబ్బందులు ఉండవని చెప్పింది. హత్య తరువాత కొద్ది రోజులాగి తన ఇంటికి రావాలని, ఆపై పెళ్లాడతానని చెప్పాలని సూచించింది. ఓ వితంతువును వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చిన యుగపురుషుడిలా నిన్ను చూస్తారని చెప్పింది. అప్పటికే బాధల్లో ఉన్న తన కుటుంబం మరో మాట అడ్డు చెప్పకుండా పెళ్లికి అంగీకరిస్తుందని, ఆ తరువాత కలసి బతుకుదామని చెప్పిందట. లేచిపోతే కనుక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోరని, భర్తను హత్య చేస్తేనే దగ్గరవుతామని నమ్మించి హత్య చేయించింది.