టీడీపీ అగ్రనేతల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి దుష్ప్రచారం.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు!

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తెలుగు దేశం పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగు యువత ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీడీపీ అగ్రనేతల ఫొటోలను వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు మార్ఫింగ్ చేస్తూ వైరల్ చేస్తున్నారని అరండల్ పోలీసులకు చెప్పారు. తెలుగు యువత నుంచి ఫిర్యాదు సేకరించిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫొటోలను తెలుగు యువత పోలీసులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇటువంటి చర్యలకు పాల్పడుతోన్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత డిమాండ్ చేస్తోంది.          
Go Back to Shorts
Telugudesam
Police
YSRCP

More Telugu News