అవనిగడ్డ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో పవన్ కల్యాణ్: జనసేన ఇన్ ఛార్జ్
- విషయాన్ని వెల్లడించిన ముత్తంశెట్టి కృష్ణారావు
- అవనిగడ్డలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం
- అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పిన పవన్
అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మరోవైపు, అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని గతంలో పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, పవన్ పోటీ చేసే స్థానంపై జనసేన నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.