అల్లు అర్జున్‌ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప‌వ‌న్ కల్యాణ్!
Add ap7am to your home Screen

అల్లు అర్జున్‌ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప‌వ‌న్ కల్యాణ్!

  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
  • బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వసూళ్లు రావడంతో ప్రేక్షకులకు థ్యాంక్స్ మీట్
  • రేపు సాయంత్రం 7గం.లకి ఈవెంట్ ప్రారంభం
ఈనెల 4న విడుద‌లైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాగానే వసూళ్లు చేపడుతోంది. దీంతో చిత్ర బృందం ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు 'థ్యాక్స్ టూ ఇండియా మీట్' పేరుతో ఓ ఈవెంట్ ని చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప‌వ‌న్ కల్యాణ్ హాజ‌రు కానున్నారు. ఈ ప్రోగ్రామ్ రేపు సాయంత్రం 7గం.లకి ప్రారంభం కానుంది. కాగా, అదే రోజున 'నేల టిక్కెట్టు' ఆడియో వేడుక‌కి కూడా ప‌వ‌న్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రుకానున్నారు.
Pawan Kalyan
Allu Arjun
Tollywood
Hyderabad

More Telugu News