ఒప్పో ఎఫ్7 డైమండ్ బ్లాక్ క్రికెట్ ఎడిషన్... 14 నుంచి విక్రయాలు!
- ధర రూ.21,990
- మొబైల్ దుకాణాలు, ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు
- 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ
ఒప్పో ఎఫ్ 7 క్రికెట్ ఎడిషన్ ఒక్క డైమండ్ బ్లాక్ ఫినిష్ తోనే వస్తుంది. ఇది కాకుండా ఎఫ్ 7లో అయితే, సోలార్ రెడ్, డైమండ్ బ్లాక్ కలర్స్ లోనూ లభిస్తుంది. ఎఫ్7 క్రికెట్ ఎడిషన్ ఆండ్రాయిడ్ ఓరియో ఆధారంగా పనిచేస్తుంది. 6.23 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, ఫుల్ స్క్రీన్ వ్యూ, 19:9 యాస్పెక్ట్ రేషియో, పి60 ఆక్టాకోర్ ప్రాసెసర్, వెనుక 16 మెగా పిక్సల్ కెమెరా, ముందు భాగంలో 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.