అలాంటి నీచులు అన్ని చోట్లా ఉన్నారు: క్యాస్టింగ్ కౌచ్ పై సమంత
- నా తొలి సినిమానే హిట్ అయింది
- అందుకే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం పెద్ద కష్టం కాలేదు
- నాకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదు
తాను నటించిన తొలి సినిమానే హిట్ కావడంతో, ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం తనకు రాలేదని సమంత తెలిపింది. గత ఎనిమిదేళ్లుగా టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో తాను నటిస్తున్నప్పటికీ, తనకు అలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పింది. సినీ పరిశ్రమలో చెడు విషయాలు మాత్రమే కాకుండా, మంచి విషయాలు కూడా ఉన్నాయని తెలిపింది. తనకు ఒక అందమైన జీవితాన్ని ఈ పరిశ్రమ ఇచ్చిందని... అందుకే పిల్లలు పుట్టిన తర్వాత కూడా నటించాలని తాను అనుకుంటున్నానని చెప్పింది.