Chandrababu: మెతకగా వుంటే ఎలా?.. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు చంద్రబాబు క్లాస్!

  • అమాయకంగా ఉంటే పార్టీ మనుగడకు కష్టం
  • కఠినంగా ఉండాలి, అందరినీ కలుపుకుని పోవాలి
  • మహానాడు తర్వాత తెలంగాణలో పర్యటిస్తా
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తీరుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. దూకుడుగా వ్యవహరించాలని, అమాయకంగా ఉంటే పార్టీ మనుగడ కష్టతరంగా మారుతుందని క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

అందరినీ కలుపుకుని పోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. మెతక వైఖరిని వీడాలని, కఠినంగా ఉండాలని తెలిపారు. జాతీయ మహానాడు తర్వాత తెలంగాణలో పర్యటిస్తానని... 2019 ఎన్నికల్లో టికెట్లు ఎవరికి ఇవ్వాలో జాబితా సిద్ధంగా ఉందని... ప్రతిభ ఉన్నవారికి ముందుగానే టికెట్లు కేటాయిస్తానని చెప్పారు. మనం బలంగా ఉంటేనే ఇతర పార్టీలు పొత్తు కోసం ముందుకు వస్తాయని అన్నారు.

More Telugu News

Chandrababu
l ramana
tTelugudesam