'పద్మ' అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం... సెప్టెంబర్ 15 చివరి తేదీ!
- ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తుల స్వీకరణ
- దరఖాస్తులను అందుబాటులో ఉంచిన హోమ్ మంత్రిత్వ శాఖ
- దరఖాస్తులు, సిఫార్సులు పంపాలని విజ్ఞప్తి
కళలు, సాహిత్యం, వైద్యం, క్రీడలు, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, పౌర సేవలు, వ్యాపార, వాణిజ్య రంగాల్లో సేవలు చేసిన వారికి ఈ అవార్డులను అందిస్తారన్న సంగతి తెలిసిందే. నియమ నిబంధనల ప్రకారం వెబ్ సైట్ లో సూచించిన విధంగా దరఖాస్తులు చేయాల్సి వుంటుందని, ఎంచుకున్న రంగంలో దరఖాస్తుదారు చేసిన కృషిని 800 పదాలకు మించకుండా రాసి పంపాలని సూచించింది.