జానకిరాముల చిత్రాలతో ముస్లిం అమ్మాయి పెళ్లి శుభలేఖ!

  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన
  • మతసామరస్యాన్ని చాటిన ముస్లిం
  • హిందూ మిత్రులకి పంచిన మహ్మద్ సలీం
మత సామరస్యాన్ని వినూత్న రీతిలో చాటిన ఉత్తరప్రదేశ్‌లోని ఓ ముస్లిం కుటుంబం పట్ల సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సుల్తానాపూర్‌లోని బాగ్‌సరి గ్రామానికి చెందిన జహానా బానో అనే ముస్లిం అమ్మాయికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయి తండ్రి మహ్మద్ సలీం పెళ్లికార్డులో సీతారాముల చిత్రాలను అచ్చువేయించి, వాటిని హిందూ మతానికి చెందిన తమ మిత్రులకు పంచాడు. అంతేకాదు, ఆ శుభలేఖతో పాటు కలశం, దీపాలు, అరటి ఆకులు, పూలు వంటి వస్తువులను కూడా పంచాడు. మతసామరస్యాన్ని పెంచుతూ మహ్మద్ సలీ చేసిన పని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. 
Go Back to Shorts
muslim
wedding card
ram

More Telugu News