బీజేపీలోకి జంప్ చేయనున్న సుజనా చౌదరి?... టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం!
- బీజేపీలోకి ఫిరాయించనున్న కేంద్ర మాజీ మంత్రి
- 'దక్కన్ క్రానికల్' ప్రత్యేక కథనం
- నిజాన్ని బయటకు రానీయండి చూద్దాం
- సుజనాపై స్పందించిన లోకేష్
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ 'ఎన్సీబీఎన్' పేరిట ఓ వాట్స్ యాప్ గ్రూప్ ను క్రియేట్ చేయగా, ఎంఎల్ఏలు, ఎంపీలు, మంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూప్ లో సుజనా పార్టీ నుంచి జంప్ కానున్నారన్న వార్త సారాంశాన్ని ఒకరు పోస్టు చేసి చర్చను ప్రారంభించగా, మంత్రి నారా లోకేష్ స్పందించినట్టు తెలుస్తోంది. "ఈ విషయంలో ఇంతవరకూ సమాచారం లేదు. నిజాన్ని బయటకు రానీయండి చూద్దాం" అని ఆయన వాట్స్ యాప్ గ్రూప్ లో ఓ పోస్టు పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక సుజనా చౌదరి పార్టీని వీడితే, ఆయన దారిలోనే మరికొందరు ఎంఎల్ఏలు, మంత్రులు నడిచే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడటం గమనార్హం. గతంలో ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి మధ్య అనుసంధానంగా వ్యవహరించిన సుజనా, ఆ సమయంలోనే బీజేపీ అగ్రనేతలకు దగ్గరయ్యారని, ఆ పరిచయాలతోనే ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం అందాల్సి వుంది.