ఎన్టీఆర్ తో పని చేయడం స్ఫూర్తిదాయకం: హైదరాబాదుకు గుడ్ బై చెప్పిన లాయిడ్ స్టీవెన్స్

  • త్రివిక్రమ్ సినిమా కోసం కండలు పెంచిన తారక్
  • స్టీవెన్స్ పర్యవేక్షణలో కసరత్తులు
  • ముగిసిన ట్రైనింగ్ పీరియడ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం జిమ్ లో కష్టపడి, కొత్త లుక్ ను సంతరించుకున్నాడు తారక్. దీనికోసం విదేశీ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో చెమటోడ్చాడు.

ట్రైనింగ్ పీరియడ్ ముగియడంతో, స్టీవెన్స్ హైదరాబాదుకు గుడ్ బై చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ, తారక్ తో పని చేయడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పాడు. తారక్ కష్టపడే తత్వం వల్ల తాము అనుకున్న దానికంటే ఎక్కువ సాధించామని తెలిపాడు. తారక్ కొత్త లుక్ ను ఎప్పుడు రివీల్ చేస్తారా? అని తాను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. స్టీవెన్ ట్వీట్ పట్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించాడు. ఎన్టీఆర్ ను కొత్తగా మేకోవర్ చేసినందుకు 'థాంక్యూ సార్' అంటూ రీట్వీట్ చేశాడు.  
Go Back to Shorts
ntr
tarak
alloyd stevens
trivikram srinivas
tollywood

More Telugu News