అక్కను వేలెత్తి చూపిస్తే భూమా క్యాడర్‌ మొత్తాన్ని వేలెత్తి చూపెట్టినట్లే.. ఊరుకోం!: భూమా మౌనిక వార్నింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్కను వేలెత్తి చూపిస్తే భూమా క్యాడర్‌ మొత్తాన్ని వేలెత్తి చూపెట్టినట్లే.. ఊరుకోం!: భూమా మౌనిక వార్నింగ్

  • భూమా కుటుంబ సభ్యులు అందరూ తగిన బుద్ధి చెబుతారు
  • మేము అక్క వెనుకే ఉన్నాం 
  • అందరం కలిసి విజయవాడకు వచ్చాము
టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఇటీవల రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అఖిలప్రియపై కొందరు విమర్శలు చేస్తున్నారని ఆమె సోదరి భూమా మౌనిక అన్నారు. ఈ రోజు తమ కుటుంబ సభ్యులమంతా విజయవాడకు వచ్చామని తెలిపారు. ఏవీ సుబ్బారెడ్డితో చెలరేగిన గొడవపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారని చెప్పారు.

"మా అక్కపై వేలెత్తి విమర్శలు చేస్తే భూమా కుటుంబ సభ్యులు అందరూ తగిన బుద్ధి చెబుతారని నేను నమ్ముతున్నాను. మా తల్లిదండ్రులు రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారు. ఏవీ సుబ్బారెడ్డి కుటుంబం మాపై చాలా వ్యతిరేకత చూపిస్తోంది. భూమా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు.. మేమంతా అక్క వెనుకే ఉన్నాం. అందరం కలిసి విజయవాడకు వచ్చాము. అక్కను వేలెత్తి చూపిస్తే భూమా క్యాడర్‌ని మొత్తం వేలెత్తి చూపెట్టినట్లే.. భూమా క్యాడర్‌ని గతంలోనూ బాధపెట్టావు.

మీరు మా నాన్న స్నేహానికి విలువ ఇవ్వలేదు. ఏ ఒక్క కార్యక్రమంలోనూ మీరు మా నాన్న ఫొటో పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా మీడియా ముందుకు వచ్చి భూమా కుటుంబంతో సంబంధం తెగిపోయిందని అంటున్నారు. ఏనాడో తెంచుకున్నావు.. నీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనిపిస్తోంది. ఇటువంటి సమయంలో మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మీరు భావిస్తే మేము కూడా సహకరిస్తాం. భూమా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తే నంద్యాల, ఆళ్లగడ్డ ప్రజలు ఊరుకోరు. మాపై పోలీస్‌ కేసు పెట్టారు.. విచారణకు సహకరిస్తాం" అని అన్నారు.
bhooma mounika
Andhra Pradesh
Telugudesam

More Telugu News