అసలిక సినిమాలే వద్దనుకున్నా: సమంత
- ఇటీవలే 'రంగస్థలం'తో హిట్ అందుకున్న సమంత
- నటనను కూడా ఉద్యోగంలా భావిస్తున్నా
- మంచి కథలు వస్తుండటంతో సినిమాలు చేస్తున్నానన్న సమంత
తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత, వ్యక్తిగత జీవితంతో పాటు నటననూ ఆస్వాదిస్తున్నానని చెప్పింది. ఒక దశలో సినిమాలు మానేద్దామని అనుకున్నానని, అయితే, మంచి కథలు వస్తుండటంతో అలా చేయాల్సిన అవసరం కలగలేదని చెప్పింది. కొత్త పాత్రలు తనకు దగ్గరవుతుండటంతో ఉత్సాహంగా ఉన్నానని, ఒకప్పుడు హిట్ సినిమాల్లో నటించినా, వాటిని ఆస్వాదించలేని పరిస్థితి నుంచి ఇప్పుడు బయటపడ్డానని వెల్లడించింది. తన సినిమాలకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ తనకెంతో ధైర్యాన్నిస్తోందని చెప్పుకొచ్చింది.