ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఉన్నతాధికారి పేరు పరిశీలన?
- తెరపైకి ఎవ్వరూ ఊహించని పేరు
- ఇటీవలే రాజీనామా సమర్పించిన అధికారి
- ఆయనకు ఇవ్వడమే మేలని భావిస్తున్న బీజేపీ పెద్దలు
ఇదిలావుండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించి ఆపై అది దక్కే అవకాశం లేదని భావిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలోకి వెళ్లే అవకాశాలు ఉండటంతో, ఇక పోటీలో సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను, రాజకీయ సమీకరణాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.