Koratala Siva: సీక్వెల్ ఆలోచనలో కొరటాల .. అభిమానుల్లో ఆసక్తి

షార్ట్స్‌లో చూడండి
'భరత్ అనే నేను' సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాలను అందుకోవడంలో కొరటాల సక్సెస్ అయ్యాడు. అలాగే మహేశ్ బాబును కొత్తగా చూపించి ఆయన అభిమానులను ఖుషీ చేశాడు. ఈ సినిమా ద్వారా కొరటాల ఇచ్చిన సందేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి.

 ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి కొరటాల మాట్లాడుతూ, ఇతర భాషల్లోకి ఈ సినిమాను అనువదించే ఆలోచన ఉందని చెప్పారు. అలాగే ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఉందని అన్నారు. 'భరత్' రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజకీయపరమైన ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాడనేది ఈ సీక్వెల్ లో చూపిస్తారట. మొదటి నుంచి కూడా మహేశ్ సీక్వెల్స్ చేయడానికి ఇష్టపడడు. మరి కొరటాల చేసిన ఆలోచన పట్ల ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి.         
Go Back to Shorts
Koratala Siva
Mahesh Babu

More Telugu News