shankar: అగ్ర కులాల్లో లేని విభజనలు బీసీలు, ఎస్సీల్లోనే ఎందుకున్నాయి?: దర్శకుడు శంకర్

షార్ట్స్‌లో చూడండి
బీసీల్లో ఐక్యత లేదని... అందుకే, అగ్రకులాల రాజకీయాలకు ఇప్పటికీ వంత పాడుతున్నారని సినీ దర్శకుడు శంకర్ అన్నారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ... బీసీలంతా ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పారు. పెద్ద కులాల్లో విభజనలు లేవని... కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో విభజనలు ఉన్నాయని అన్నారు.

బీసీ కులాలకు చెందిన ప్రతి వ్యక్తి ఇకపై తమ వాహనాలపై బీసీ అనే స్టిక్కర్ ను అతికించుకుని గర్వంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. హైదరాబాదులో జరిగిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నటులు సుమన్, ఆర్.నారాయణమూర్తిలతో కలసి బీసీల స్టిక్కర్ ను ఆవిష్కరించారు.
Go Back to Shorts
shankar
director
bc

More Telugu News