shardhul tahkur: రాజస్థాన్ తో మ్యాచ్ లో కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన శార్థుల్ ఠాకూర్

షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో స్టువర్ట్ బిన్నీ క్యాచ్ ను శార్ధుల్ ఠాకూర్ పట్టుకున్న విధానం క్రికెట్ ప్రేమికులతో శభాష్ అనేలా చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో వాట్సన్ మెరుపులతో 204 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్, ఫీల్డింగ్ లలో చెన్నై ఆకట్టుకుంది. 16వ ఓవర్ లో రెండో బంతికి రాజస్థాన్ రాయల్స్ 117 పరుగుల వద్ద ఉండగా, బ్యాట్స్ మన్ స్టువర్ట్ బిన్నీ భారీ షాట్ కు యత్నించాడు.

బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచి కొంచెం ముందు పడబోయింది. సాధారంగా అలాంటి క్యాచ్ లను పట్టేందుకు కీపర్ ముందుకు పరుగెడతాడు. కానీ బంతిని వేసిన శార్ధుల్ ఠాకూర్ వేగంగా ముందుకు కదిలాడు. బంతి గమనాన్ని అంచనా వేస్తూ, కుడి చేతిని ముందుకు చాపి బంతిని ఒడిసి పట్టుకుని డైవ్ వేశాడు. ఈ క్యాక్ క్రీడాభిమానులను ఆకట్టుకుంది. దీనికి ‘పర్‌ ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ సొంతం చేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
shardhul tahkur
ipl
csk

More Telugu News