Balakrishna: మోదీ.. నిన్ను కొట్టి కొట్టి తరుముతాం: బాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి... నిన్ను కొట్టి కొట్టి తరుముతామని, బంకర్ లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతామంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు బీజేపీకి రెండు సీట్లు ఉండేవని... వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని అన్నారు.

ఎవరెవరినో అడ్డం పెట్టుకుని వ్యవహారాలని నడిపిస్తున్నావని విమర్శించారు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానేయాని మోదీకి బాలయ్య సూచించారు. అమరావతి శంకుస్థాపనకు మట్టి, పవిత్ర జలాలను మోదీ తీసుకురావడం గురించి మాట్లాడుతూ... మా దగ్గర మట్టి, నీళ్లు లేవా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి ఆంధ్రుడు ఒక్కో గౌతమీపుత్ర శాతకర్ణిలా మోదీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీని ఉద్ధరించే శక్తి కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందని అన్నారు. 
Go Back to Shorts
Balakrishna
Chandrababu
Narendra Modi

More Telugu News