Balakrishna: ముందు భార్యను ప్రేమించడం నేర్చుకోండి: మోదీపై బాలకృష్ణ ఫైర్

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని, అద్వాణీని గౌరవించలేని వ్యక్తి మీరు అని విమర్శించారు. కట్టుకున్న భార్యను కూడా మీరు గౌరవించడం లేదని ఎద్దేవా చేశారు. కార్యేషు దాసి, కరణేశు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అంటారని... ముందు భార్యను ప్రేమించడం నేర్చుకోవాలంటూ హితవు పలికారు.

అమిత్ షా లాంటివారు పక్కన ఉండి డప్పు కొడుతుంటే... రోజులు గడిపేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు బీజేపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఉండేవని... ఇప్పుడు బీజేపీ ఈ స్థాయిలో ఉండటానికి ఎన్టీఆర్, చంద్రబాబులే కారణమని బాలయ్య చెప్పారు. ఏపీకి నరేంద్ర మోదీ తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని చెప్పారు. చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష వేదికపై నుంచి మాట్లాడుతూ బాలయ్య ఈమేరకు మండిపడ్డారు.

Go Back to Shorts
Balakrishna
Narendra Modi
Chandrababu
ntr

More Telugu News