సైకిల్ యాత్ర చేస్తున్న కోడెలను ఢీకొన్న ద్విచక్రవాహనం
- చంద్రబాబు దీక్షకు మద్దతుగా కోడెల సైకిల్ యాత్ర
- నరసరావుపేట నుంచి కోటప్పకొండకు యాత్ర
- కోడెల సైకిల్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడు
సైకిల్ యాత్ర కొనసాగుతున్న సమయంలో యలమంద వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కోడెల సైకిల్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కోడెల కిందకు పడిపోయారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. పక్కనే ఉన్న నేతలంతా ఆయనను పైకి లేపి, సపర్యలు చేశారు. కాసేపు సేదదీరిన అనంతరం కోడెల తన యాత్రను కొనసాగించారు.