క్రీమ్ బన్ తింటూ డబ్బింగ్ చెప్పుకున్న సమంత ఫొటో
- తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్న సమంత
- ఫొటో పోస్ట్ చేసి అలరించిన శామ్
- విడుదలకు సిద్ధమవుతోన్న 'మహానటి'
'నేను.. నా క్రీమ్ బన్.. మహానటి డబ్బింగ్ పూర్తయింది' అని శామ్ చెప్పింది. కాగా, ఈ సినిమా వచ్చేనెల 9న విడుదల కానుంది. ఈ సినిమాలో సావిత్రిగా నటిస్తోన్న హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. 'మహానటి' టీజర్ ఇటీవలే విడుదలైంది. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.