నా జీవితంలో ఎక్కువ ప్రయాణించింది వాళ్లిద్దరితోనే!: దర్శకుడు కొరటాల శివ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా జీవితంలో ఎక్కువ ప్రయాణించింది వాళ్లిద్దరితోనే!: దర్శకుడు కొరటాల శివ

  • నా చిన్నప్పుడే   మా తండ్రి చనిపోయారు
  • మా అమ్మే నన్ను పెంచారు
  • నాకు పెళ్లయిన కొన్నేళ్లకే మా అమ్మ చనిపోయారు
  •  నా జీవితంలో ఎక్కువగా ప్రయాణం చేసింది నా తల్లి, భార్యతోనే
తన జీవితంలో మహిళకు ఉన్న ప్రాముఖ్యత ఎక్కువ అని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఈయన పేరు ప్రస్తావించకుండా నటి శ్రీశక్తి ఆయనపై పరోక్ష ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నా చిన్నప్పుడే మా తండ్రి చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మే నన్ను పెంచారు. నా పెళ్లి అయిన కొన్నేళ్లేకే ఆమె చనిపోయారు. అప్పటి నుంచీ నా భార్య నన్ను చూసుకుంటున్నారు.

స్వామి వివేకానందను ఆమె అనుసరిస్తారు. దాంతో మేమందరం కూడా స్వామి వివేకానంద ఫాలోవర్స్ గానే ఉన్నాం. నా జీవితంలో ఎక్కువగా ప్రయాణం చేసింది నా తల్లి, భార్యతోనే. మాది మొదటి నుంచి అంత పెద్ద కుటుంబం కాదు. ఎక్కువ మంది బంధువులు కూడా లేరు. నా జీవితంలో నా తల్లి, భార్యతో కలిసి ఎక్కువగా ఉండటంతో మహిళలంటే నాకు ఎక్కువ గౌరవం. వ్యక్తిగతంగానే కాదు వృత్తిరీత్యా కూడా మహిళలను బాగా గౌరవిస్తాను. నా సినిమాల్లో కూడా వారిని కించపరిచే విధంగా ఒక సన్నివేశం కూడా ఉండదు’ అని అన్నారు.
Tollywood
Koratala Siva

More Telugu News