Tollywood: ఆ వ్యాధి కారణంగానే లావై పోయాను: సినీ డ్యాన్సర్ ముమైత్ ఖాన్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో తన డ్యాన్స్ లతో మైమరపించిన ముమైత్ ఖాన్ తెలుగులో నటించిన చివరి చిత్రం 2016లో వచ్చిన ‘తిక్క’. ఈ సినిమా తర్వాత ఆమె స్క్రీన్ పై కనపడలేదు. తాను ఇన్నాళ్లూ తెరపైకి రాకవపోడానికి గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా ముమైత్ ఖానే వెల్లడించింది. రెండేళ్ల పాటు తాను మూర్ఛ వ్యాధితో బాధపడ్డానని, వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నానని చెప్పింది.

వైద్యులు సూచనల మేరకు రెండేళ్ల వరకు ఎలాంటి బరువులు మోయకూడదని చెప్పారని తెలిపింది. చాలా లావై పోయానని, కానీ, ఎటువంటి ఇబ్బందిగా లేదని, తాను కోలుకున్న అనంతరం తన దేహదారుఢాన్ని సరైన ఆకృతిలోకి మలచుకుంటానని, అలా చేయడం తనకు చాలా సులభమని చెప్పింది. తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకున్నానని, ఈ నేపథ్యంలో ఓ సంస్థను ఆశ్రయించినట్టు చెప్పింది. ప్రతిరోజు మంచి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, ఎనిమిది గంటలు నిద్ర పోవడం చేస్తే మన జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని ముమైత్ తెలిపింది. 
Go Back to Shorts
Tollywood
Mumaith Khan

More Telugu News