srireddy: రామానాయుడు స్టూడియోలో వందల మంది ఆడపిల్లల మానాలు నలిగిపోతున్నాయి: నటి శ్రీరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కుమారుడు అభిరామ్‌ సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను వాడుకొని మోసం చేశాడని సినీ నటి శ్రీరెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అభిరామ్‌ లాంటి వ్యక్తుల్ని నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాలని తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఆమె పోస్ట్ చేసింది.

రామానాయుడు స్టూడియోలో వందల మంది ఆడపిల్లల మానాలు నలిగిపోతున్నాయని, తక్షణం వాళ్ల నుంచి విముక్తి కలిగించాలని పేర్కొంది. అమ్మాయిల ఫీలింగ్స్ తో ఆడుకొనే ఎవడినీ వదిలేది లేదని, ఇక ముందు ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోవాలన్నా భయపడాలని.. తాను చేస్తున్న ఉద్యమానికి మరకలు అంటించేవాళ్లకి ఇదే తన సవాల్ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Go Back to Shorts
srireddy
Tollywood
Hyderabad
Telangana

More Telugu News