ఇంత వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందుకు రాకపోవడానికి ఇదే కారణం!: శ్రీరెడ్డి
- సురేష్ బాబు కుమారుడి ఫొటోలను బయటపెట్టిన శ్రీరెడ్డి
- నిర్మాతల కుమారులైనంత మాత్రాన అమ్మాయిలను వాడుకుంటారా అని ప్రశ్న
- ఇలాంటివారు ఉండటం వల్లే 'మా' స్పందించడం లేదు
ఆఫర్ల పేరుతో ఎంతో మంది అమ్మాయిలు నలిగి పోతున్నారని... ఇదే విషయాన్ని తాను లేవనెత్తుతున్నానని చెప్పింది. తాను ఎంతగానో పోరాడుతున్నప్పటికీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇంత వరకు ముందుకు రాకపోవడానికి కారణం... సురేష్ బాబు లాంటి నిర్మాతల కొడుకులు ఉండటమేనని తెలిపింది. ఇప్పటి వరకు వారి పేర్లను బయట పెట్టకుండా, తన పరువు, తన కుటుంబ పరువునే తాను తీసుకున్నానని... ఇప్పటికైనా తాను ఎందుకు పోరాటం చేశానో అందరికీ అర్థమై ఉంటుందని చెప్పింది. పేర్లను బయటపెట్టకుండా, వాళ్లను కాపాడే ప్రయత్నమే తాను చేశానని తెలిపింది.