charan: 'మగధీర' రికార్డుకు దగ్గరికి వచ్చేసిన 'రంగస్థలం'

షార్ట్స్‌లో చూడండి
చరణ్ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకెళుతోంది. పాత రికార్డులను తిరగరాస్తూ కొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నైజామ్ విషయంలో 'మగధీర' రికార్డును అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నైజామ్ ఏరియాలో 'రంగస్థలం ' సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. గతంలో ఇక్కడ 'మగధీర' 22.64 కోట్లను వసూలు చేసింది. చరణ్ కెరియర్లో ఈ ఏరియాలో ఈ స్థాయి వసూళ్లను సాధించిన సినిమా ఇదొక్కటే. ఇప్పుడు  ఈ ఏరియాలో 20 కోట్ల వరకూ కొల్లగొట్టి ఈ రికార్డుకి దగ్గరగా వచ్చేసిన 'రంగస్థలం' .. త్వరలో దానిని క్రాస్ చేసే అవకాశాలు చాలా వరకూ కనిపిస్తున్నాయి. నైజామ్ లో 'రంగస్థలం' మరో కొత్త రికార్డును సృష్టించడం ఖాయమని మెగా అభిమానులు అంటున్నారు.       
Go Back to Shorts
charan
samantha

More Telugu News