బ్రాబోయ్... 10 బంతుల్లో 39 పరుగులతో విధ్వంసం!
- చివరి 3 ఓవర్లలో చేయాల్సిన పరుగులు 47
- 10 బంతుల్లోనే 39 పరుగులు చేసిన బ్రావో
- అసాధ్య విజయాన్ని సునాయాసం చేసిన మెరుపు ఇన్నింగ్స్
18వ ఓవర్ నుంచి వీరవిహారం చేసి, వరుసగా, 6, 6, 2, 4, 1, 6, 6, 2, 0, 6 పరుగులు పిండుకున్నాడు. తాను ఎదుర్కొన్న 10 బంతుల్లో 39 పరులుగు చేశాడు. దీంతో జయాపజయాల సమీకరణాలు మారిపోయాయి. అనూహ్య మలుపులు తిరిగి మ్యాచ్, ఉత్కంఠను పెంచుతూ సాగగా, విజయంపై ధీమాగా ఉన్న ముంబై డగౌట్ తో పాటు బ్రావో విధ్వంసంతో వాంఖడే స్టేడియంలోని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మూగబోయారు.