ipl 2018: అంగరంగ వైభవంగా ఐపీఎల్ ప్రారంభ వేడుకలు

షార్ట్స్‌లో చూడండి
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 ప్రారంభ వేడుకలు ఘనంగా  ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ 11వ సీజన్ ఆరంభ వేడుకల్లో ప్రముఖ కొరియో గ్రాఫర్ ప్రభుదేవా, బాలీవుడ్ హీరో వరుణ్ థావన్ తమ డ్యాన్స్ తో స్వాగతం పలికారు. అనంతరం, ‘స్వింగ్ జరా’ అంటూమిల్కీ బ్యూటీ తమన్నా తన డ్యాన్స్ తో ఆకట్టుకుంది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్ తన పాటలతో మైమరపించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హీరో హృతిక్ రోషన్ చేసిన డ్యాన్స్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుక చివర్లో, వీళ్లందరూ కలిసి ఐపీఎల్ సాంగ్ ను పాడారు. కాగా, దాదాపు 8 వారాల పాటు జరగనున్న ఐపీఎల్ లో 8 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 60 మ్యాచ్ లు జరగనున్నాయి. ఐపీఎల్ లో తొలి పోరు ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది.
Go Back to Shorts
ipl 2018
mumbai

More Telugu News