Rohit Sharma: రోహిత్ శర్మ ఓపెనర్ కాదు... పించ్ హిట్టర్?

ఐపీఎల్‌ సీజన్-11లో బ్యాటింగ్ ఆర్డర్ మార్పులతో అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఐపీఎల్ లో ఓపెనింగ్, పించ్ హిట్టింగ్ కీలకమన్న సంగతి తెలిసిందే. గత సీజన్లన్నింటిలో ఓపెనర్ గా రంగప్రవేశం చేసిన రోహిత్ శర్మ ఈ సారి బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చుకున్నట్టు తెలిపాడు.

 ఈ సీజన్‌ లో ఓపెనర్లుగా ఎల్విన్ లూయిస్ (వెస్టిండీస్), ఇషాన్ కిషన్ లు రానున్నారని చెప్పాడు. అలాగే మిడిల్ ఆర్డర్ కూడా బలంగా ఉందని చెప్పాడు. తాను ఏడో స్థానంలో బ్యాటింగ్‌ కు రానున్నానని రోహిత్ చెప్పాడు. రేపటి మ్యాచ్ లో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని రోహిత్ అన్నాడు. జట్టు ప్రదర్శనపై ఆందోళన లేదని, తమ జట్టు సమతూకంగా ఉందని తెలిపాడు. 
Rohit Sharma
Cricket
ipl

More Telugu News