అరుదైన అభ్యర్థన: పురుషుడిగా మారుతానని సీఎంను కోరుతున్న మహిళా కానిస్టేబుల్!
- మహారాష్ట్ర పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న లలితా సాల్వే
- నాలుగేళ్ల క్రితం తనలో మార్పులను గుర్తించిన కానిస్టేబుల్
- శస్త్ర చికిత్సతో పురుషుడిగా మారుతానని సీఎంకు అభ్యర్థన
ఈ క్రమంలో శస్త్రచికిత్స కోసం నెలరోజుల సెలవు మంజూరు చేయాలనీ, ఆ తరువాత పురుష కానిస్టేబుల్ గా కొనసాగేందుకు అనుమతించాలని కోరుతూ ఆమె మహారాష్ట్ర పోలీసు శాఖను అభ్యర్థించారు. ఎత్తు, బరువు సహా స్త్రీ, పురుష కానిస్టేబుళ్లకు వేర్వేరు అర్హత నిబంధనలు ఉంటాయనీ, అందువల్ల మహిళా కానిస్టేబుల్ శస్త్ర చికిత్స ద్వారా పురుష కానిస్టేబుల్ గా మారేందుకు సెలవు మంజూరు చేయడం కుదరదని పోలీసు శాఖ స్పష్టం చేసింది.
దీంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. వ్యాజ్యం ఉద్యోగానికి సంబంధించినది కావడంతో పరిపాలన ట్రైబ్యునల్ ను ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఆమె సీఎంను ఆశ్రయించింది. పురుషుడిగా మారి, విధుల్లో కొనసాగేందుకు అనుమతినివ్వాలని కోరింది. ఆయన అనుమతి కోసం రెండు వారాలుగా ఎదురు చూస్తోంది. అరుదైన అభ్యర్థన కావడంతో ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. సీఎం ఏం చెబుతారోనని ఆమె ఆసక్తిగా ఎదురుచూస్తోంది.