అన్ని రంగాల్లోనూ లైంగిక వేధింపులు... టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై జగపతిబాబు అభిప్రాయమిది!
- గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టే సినీ పరిశ్రమపై చర్చ
- ఆ పరిస్థితి ఎదురైతే అమ్మాయిలు నిరాకరించాలి
- నటుడు జగపతిబాబు సలహా
తనవరకూ సినీ రంగం సురక్షితమైనదన్న అభిప్రాయమే ఉందని, తన కుమార్తెలు యాక్టింగ్ చేస్తానని చెబితే, అభ్యంతరపెట్టబోనని స్పష్టం చేశారు. తన చిన్న కూతురు చదవలేక చదువుతుంటే, శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు కదా? అని సలహా కూడా ఇచ్చానని అన్నారు. అయితే, తన బిడ్డలకు ఈ రంగంపై ఆసక్తి లేదని జగపతిబాబు చెప్పుకొచ్చారు. తనకు పారితోషికం గురించిన ఆలోచనే రాదని, కొన్నిసార్లు డబ్బులు అడక్కుండానే సినిమాలు చేస్తానని చెప్పిన జగపతిబాబు, ఇటీవల ఓ చిన్న సినిమా కథనచ్చి, రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా నటించేందుకు అంగీకరించానని చెప్పారు.