madhavi latha: ఆ విషయంలో ఇప్పుడున్న నాయకులకు ఉన్నంత అనుభవం పవన్ కల్యాణ్ కు లేదు: హీరోయిన్ మాధవీలత
- జనాలను పవన్ మోసం చేయలేదు
- కష్టపడిన డబ్బునే తీసుకోవడం ఆయనకు చేతకాదు
- అమరావతిలో పవన్ ఇల్లు కట్టుకుంటే తప్పేంటి?
ఇప్పుడున్న రాజకీయ నాయకులు జనాలను గొప్పగా మోసం చేస్తారని... మోసం చేయాలంటే అనుభవం ఉండాలని... అంత అనుభవం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేదని హీరోయిన్ మాధవీలత తెలిపింది. జనాలను పవన్ మోసం చేయలేరని చెప్పింది. కష్టపడి పనిచేసిన డబ్బును తీసుకోవడమే చేతకాని ఎమోషనల్ పర్సన్ పవన్ అని తెలిపింది. ఇలాంటి వ్యక్తి జనాలను ఇంకేం దోచుకుంటారని చెప్పింది.
అమరావతిలో పవన్ కల్యాణ్ ఇల్లు కట్టుకోవడం నేరమా? అని ప్రశ్నించింది. ఎవరెవరో అనామకులు బిల్డింగ్ లు, ప్యాలెస్ లను కట్టుకుంటున్నారని... పవన్ కల్యాణ్ లాంటి సూపర్ స్టార్ ఇల్లు కట్టుకుంటే తప్పా? అని అడిగింది. కొత్తగా వచ్చిన హీరోలకు కూడా పెద్దపెద్ద విల్లాలు ఉన్నాయని చెప్పింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి మాధవీలత సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఆహ్వానిస్తే... తాను జనసేనలో చేరుతానని ఇప్పటికే ఆమె ప్రకటించింది.