Chandrababu: రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు పాలిస్తూ మంత్రులను డమ్మీ చేశారు : సోము వీర్రాజు

షార్ట్స్‌లో చూడండి
ఏపీని తండ్రీకొడుకులు పాలిస్తూ మంత్రులను డమ్మీ చేశారంటూ చంద్రబాబు, లోకేశ్ లపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. కర్నూలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేఈ కృష్ణమూర్తి, చిన రాజప్పలు కేవలం పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎంలని, వాళ్లకు ఎలాంటి అధికారాలు లేవని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సీఎం చంద్రబాబు తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు కేంద్రాన్ని నిందిస్తున్నారని, ప్రత్యేక ప్యాకేజ్ విషయమై ప్రధాని మోదీని గతంలో అభినందించిన చంద్రబాబు, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో ఆయన ఎందుకు లాలూచీ పడుతున్నారో అర్థం కావట్లేదని, సోనియాతో చంద్రబాబు రహస్య మంతనాలు జరిపారని ఆరోపించారు.
Go Back to Shorts
Chandrababu
lokesh
somu veeraj

More Telugu News