trivikram: మళ్లీ సునీల్ ను నిలబెట్టే ప్రయత్నంలో త్రివిక్రమ్

షార్ట్స్‌లో చూడండి
సునీల్ కమెడియన్ గా ఎదగడం వెనుక త్రివిక్రమ్ కృషి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. సునీల్ కోసం ఆయన రాసిన కామెడీ ట్రాక్ లు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకునేవి. సునీల్ కి అవకాశాలను అమాంతంగా పెంచేసేవి. అలా సునీల్ ను త్రివిక్రమ్ నిలబెట్టేశాడు. అయితే ఆ తరువాత హీరోగా మారిన సునీల్ ఆరంభంలో మాత్రమే విజయాలను సొంతం చేసుకోగలిగాడు.

 కొంతకాలంగా ఆయనను ఒక్క సక్సెస్ కూడా పలకరించలేదు. దాంతో అవకాశం వస్తే హీరోగా చేయాలనీ, లేదంటే కమెడియన్ గా చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. పూర్తిస్థాయి కమెడియన్ గా ఆయనను మళ్లీ  ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమాలో సునీల్ కి సెక్యూరిటీ ఆఫీసర్ పాత్ర ఇచ్చాడు. సునీల్ కోసం ఈ పాత్రను ఒక రేంజ్ లో డిజైన్ చేసి .. సునీల్ ను మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాతో కమెడియన్ గా సునీల్ కి పూర్వవైభవం వస్తుందేమో చూడాలి.   
Go Back to Shorts
trivikram
sunil

More Telugu News