పన్నులు చెల్లించడం లేదంటూ అమేజాన్ పై నిప్పులు చెరిగిన అమెరికా అధ్యక్షుడు
- వేలాది మంది రిటైలర్లను రోడ్డున పడేస్తోంది
- పోస్టల్ వ్యవస్థను డెలివరీ బోయ్ గా వాడుకుంటోంది
- అయినా పన్నులు కట్టడం లేదంటూ ట్రంప్ విమర్శలు
అయితే, తాజాగా యాక్సియోస్ అనే వెబ్ సైట్ అమేజాన్ ప్రపంచ అతిపెద్ద ఆన్ లైన్ రిటైలర్ గా తన శక్తిని పెంచుకుంటోందని, యాంటీ ట్రస్ట్, పోటీ నిరోధక చట్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో ట్రంప్ మరోసారి అమేజాన్ పై విమర్శలు గుప్పించారు. ‘‘అమేజాన్ కు అధ్యక్ష ఎన్నికలకు చాలా ముందే నా ఆందోళనలను తెలియజేశా. ఇతరుల మాదిరిగా కాకుండా ఆ సంస్థ చాలా తక్కువ లేదా అసలు పన్నులే కట్టడం లేదు. మా పోస్టల్ వ్యవస్థను వారి డెలివరీ బోయ్ గా వినియోగించుకుంటోంది. వేలాది మంది రిటైలర్లు వ్యాపారం నుంచి తప్పుకునేలా చేస్తోంది’’ అని ట్రంప్ ద్వజమెత్తారు.