nithya menon: ఒకే సినిమాకి ఓకే చెప్పేసిన నిత్యామీనన్ .. సాయిపల్లవి

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా నిత్యామీనన్ కి మంచి క్రేజ్ వుంది. ఇక సాయిపల్లవి కూడా అదే బాటలో కొనసాగుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ కథానాయికలిద్దరూ ఇప్పుడు ఒక తమిళ సినిమాలో కలిసి నటించనుండటం విశేషం.

ప్రముఖ నటుడు కె.భాగ్యరాజ్ తనయుడు శంతను భాగ్యరాజ్ ఒక సినిమాకి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం నిత్యామీనన్ ను .. సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నాడు. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. నటుడిగానే కాదు .. దర్శకుడిగానూ కె. భాగ్యరాజ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన తనయుడిగా శంతను భాగ్యరాజ్ కూడా రాణిస్తాడేమో చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 
Go Back to Shorts
nithya menon
sai pallavi

More Telugu News