'సైరా' సెకండ్ షెడ్యూల్ కి రంగం సిద్ధం
- సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా'
- రెండవ షెడ్యూల్లో అమితాబ్ .. నయన్
- షూటింగ్ విశేషాలు బయటపెట్టొద్దనే నిర్ణయం
ఈ షెడ్యూల్లో అమితాబ్ .. నయనతార కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఫస్టు షెడ్యూల్ కి .. సెకండ్ షెడ్యూల్ కి మధ్య గ్యాప్ ఎక్కువగా రావడంతో, నానా రకాల పుకార్లు షికారు చేశాయి. అందువలన ఇక నుంచి ఈ సినిమా షూటింగ్ విశేషాలను బయటకి రాకుండా చూడాలని పీఆర్ టీమ్ భావిస్తున్నట్టుగా సమాచారం. అభిమానుల్లో అంచనాలు పెరగకూడదనీ .. షూటింగ్ జరిగే ప్రదేశాల్లో అంతరాయాలు కలగకూడదనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.