ఇద్దరు దర్శకులకు ఖరీదైన కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన సూర్య

  • క్రితం ఏడాది సూర్యకి హిట్ ఇచ్చిన దర్శకుడు హరి
  • ఈ ఏడాది సక్సెస్ ను ఇచ్చిన విఘ్నేష్ శివన్ 
  • ఇద్దరికీ చెరో కారును గిఫ్ట్ గా ఇచ్చిన సూర్య  
తమిళ అగ్ర కథానాయకుల జాబితాలో సూర్య కనిపిస్తాడు. ఒక వైపున నిర్మాతగానూ .. మరో వైపున హీరోగాను సూర్య చకచకా సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు. తనకి సక్సెస్ ను అందించిన దర్శకులకు ఖరీదైన కానుకలను అందజేయడం సూర్యకు మొదటి నుంచి అలవాటు. అలా తాజాగా ఆయన 'సింగం 3' దర్శకుడు 'హరి'కి .. 'తానా సెరిందా కూట్టమ్' దర్శకుడు విఘ్నేష్ శివన్ కి చెరో కారును కానుకగా ఇచ్చాడు. 2017 లో వచ్చిన 'సింగం 3' అక్కడ సూర్యకు విజయాన్ని అందించింది. ఇక ఈ ఏడాది జనవరిలో వచ్చిన 'తానా సెరిందా కూట్టమ్' ఆయనకు హిట్ తెచ్చిపెట్టింది. ఈ కారణంగా ఈ ఇద్దరి దర్శకులకు ఆయన కార్లను కానుకగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం సెల్వరాఘవన్ తో ఒక సినిమా చేస్తోన్న సూర్య, మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు.  
Go Back to Shorts
surya
hari
vighnesh shivan

More Telugu News