త్రిష నాకు చిన్నప్పటి నుంచి తెలుసు .. మా మధ్య అలాంటిదేం లేదు: హీరో శింబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రిష నాకు చిన్నప్పటి నుంచి తెలుసు .. మా మధ్య అలాంటిదేం లేదు: హీరో శింబు

  • శింబు .. త్రిష జోడీగా వచ్చిన 'విన్నై తాండి వరువాయా'
  • ఈ సినిమాతోనే ఈ జంటపై పుకార్లు 
  • ఆ మూవీ సీక్వెల్ కి సన్నాహాలు
కొంతమంది కథానాయికలతో శింబు నడిపిన ప్రేమాయణం గురించి కోలీవుడ్ జనాలు కథలు .. కథలుగా చెప్పుకుంటారు. అలా ఆయన ప్రేమాయణం నడిపిన కథానాయికల జాబితాలో త్రిష పేరు కూడా కనిపిస్తూ ఉంటుంది. కెరియర్ మొదట్లో శింబు .. త్రిషతో కలిసి రెండు సినిమాల్లో నటించాడు. ఆ సమయంలోనే వాళ్లిద్దరూ ప్రేమలో పడినట్టుగా జోరుగా ప్రచారం జరిగింది.

 ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'విన్నైతాండి వరువాయా' అప్పట్లో అక్కడ ఘన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గురించి తాజాగా శింబు స్పందించాడు. అప్పట్లో తనకీ .. త్రిషకి మధ్య ప్రేమాయణం కొనసాగిందంటూ జరిగిన ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదని శింబు చెప్పాడు. తనకి త్రిష చిన్నప్పటి నుంచీ తెలుసనీ .. ఆమెతో తనకి స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేశాడు.  
simbu
trisha

More Telugu News