సూర్య దూకుడు మాములుగా లేదు .. 38వ చిత్రానికి సన్నాహాలు

  • సెల్వ రాఘవన్ తో సూర్య
  • తదుపరి సినిమా దర్శకుడిగా కేవీ ఆనంద్
  • ఆ తరువాత ప్రాజెక్టు సుధా కొంగరతో          
మొదటి నుంచి కూడా సూర్య వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. సినిమాకి .. సినిమాకి మధ్య పెద్దగా గ్యాప్ రాకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. పరాజయాలు ఎదురైనా వాటిని గురించి పట్టించుకోకుండా ఆయన అదే దూకుడును కొనసాగిస్తూ ఉండటం విశేషం. ప్రస్తుతం ఆయన తన 36వ సినిమాను సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'ఎన్.జి. కె. అనే టైటిల్ తో ఈ సినిమా ఫస్టులుక్ ఇటీవలే బయటికివచ్చింది.

 ఇక తన 37వ సినిమాను ఆయన కేవీ ఆనంద్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తన 38వ సినిమాను కూడా లైన్లో పెట్టేశాడని తెలుస్తోంది. తమిళంలో 'ఇరుదు సుట్రు'తో హిట్ కొట్టి .. 'గురు' పేరుతో తెలుగులో రీమేక్ చేసిన సుధా కొంగర, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించనున్నట్టు సమాచారం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.    
Go Back to Shorts
surya
sudha kongara

More Telugu News