బస్సులో యువతికి 'కన్నుకొట్టిన' బీఎస్ఎఫ్ జవాన్ అరెస్ట్....!
- ఎన్‌జీఓలో పనిచేస్తున్న యువతితో బీఎస్ఎఫ్ జవాన్ అసభ్య ప్రవర్తన
- బస్సులో తదేకంగా చూస్తూ కన్నుకొట్టిన వైనం
- తోటి ప్రయాణికుల సాయంతో నిందితుడి అరెస్ట్
జానక్‌పురి స్టాపు వద్ద ఆమె బస్సెక్కింది. మహిళలకు కేటాయించిన సీటులో కూర్చుంది. అదే బస్సులో ఉన్న చరణ్ సింగ్ తన ఎదురుగా నిల్చుని తనను తదేకంగా చూశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనను ఎందుకలా చూస్తున్నావని అడిగితే తన వంక అదోలా చూస్తూ కన్ను కొట్టాడని ఆమె ఆరోపించింది. బస్సులోని ఇతర ప్రయాణికుల జోక్యంతో నిందిత జవాన్‌ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే సింగ్ మత్తులో ఉండి అలా చేశాడని, వైద్య పరీక్షల కోసం అతన్ని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అరెస్టయిన సమయానికి సింగ్ విధుల్లో లేడని వారు చెప్పారు.