టీడీపీ దుష్ర్పచారాన్ని తిప్పికొడతాం : బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ దుష్ర్పచారాన్ని తిప్పికొడతాం : బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ

  • చంద్రబాబు విభజన రాజకీయాలు చేస్తున్నారు
  • ఉత్తరాది, దక్షిణాదిగా విభజించి మాట్లాడటం సబబు కాదు
  • ప్రత్యేక ప్యాకేజీ కు చంద్రబాబు నాడు అంగీకరించారు
  • రాజకీయ లబ్ధి కోసం యూ టర్న్ తీసుకున్న బాబు : ఆకుల
తమ పార్టీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు విభజన రాజకీయాలు చేస్తున్నారని, దేశాన్ని ఉత్తరాది, దక్షిణాదిగా విభజించి ఆయన మాట్లాడటం సబబు కాదని, ఈవిధంగా మాట్లాడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే గతంలో అంగీకరించిన చంద్రబాబు, ఇప్పుడు, ప్రత్యేకహోదా కావాలని అంటున్నారని, రాజకీయ లబ్ధి కోసం ఆయన యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు.
BJP
aakula satyanarayana

More Telugu News