ముంబైలో నెలకు రూ.15 లక్షల అద్దెతో కోహ్లీ దంపతుల కొత్త ఫ్లాట్
- వోర్లీలోని రహేజా లెజండ్స్ అపార్ట్మెంట్లో కొత్త ఫ్లాట్‌కు అగ్రిమెంట్
- ఇందులో రెండేళ్లు మాత్రమే ఉండేలా తాత్కాలిక ఏర్పాటు
- ఫ్లాట్‌కు నెలకు రూ.15 లక్షల అద్దె చెల్లింపు...!
కాగా, అక్టోబరు, 2016లో వోర్లీలో 'ఓంకార్ 1973' అపార్ట్మెంట్లోని 35వ అంతస్థులో ఓ ఫ్లాట్‌ను విరాట్ రూ.34 కోట్లకు కొనుగోలు చేశాడు. దీని విస్తీర్ణం 7,171 చదరపు అడుగులు. ఇది 5-బీహెచ్‌కే లగ్జరీ హోమ్. మరో విశేషమేమిటంటే...ఇదే అపార్ట్మెంట్లోని 29వ అంతస్థులో ఉన్న ఓ ఫ్లాట్‌ను క్రికెటర్ యువరాజ్ సింగ్-హజీల్ కీచ్ దంపతులు కొనుగోలు చేశారు. కాగా, డిసెంబరు 11, 2017న తమ కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య విరాట్-అనుష్క జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.