పురుషులు, మహిళలు సమానం కాదు: మహిళా దినోత్సవం సందర్భంగా కోహ్లీ శుభాకాంక్షలు
- సమానత్వం కంటే స్త్రీలు ఎక్కువే
- నిజాయతీగా చెప్పాలంటే ఒకరితో ఒకరిని పోల్చకూడదు
- అన్నిటినీ భరిస్తూ మహిళలు ఎదుగుతున్నారు
ఈ సందర్భంగా వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ, స్త్రీ, పురుషులు సమానం కాదన్నాడు. నిజాయతీగా చెప్పాలంటే ఒకరితో ఒకరిని పోల్చకూడదని చెప్పాడు. లైంగిక వేధింపులు, వివక్ష, సెక్సిజమ్, గృహ హింస, బెదిరింపులు.. లిస్టు చాలా పెద్దదైనా, వాటన్నింటినీ భరిస్తూ కూడా మహిళలు ఎదుగుతున్నారని హర్షం వ్యక్తం చేశాడు. సమానత్వం కంటే వాళ్లు ఎక్కువే అయినప్పటికీ, పురుషులతో మహిళలకు సమానత్వం లేదని పేర్కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.