రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది: ఏపీ మంత్రి లోకేశ్

  • నిధులు కూడా ఇవ్వట్లేదు
  • ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు మిగతా అంశాలు కూడా ప్రధానమైనవే
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది
రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అన్యాయం జరిగిందని, రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఏపీ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన లోకేశ్ కేంద్ర ప్రభుత్వ తీరుపై స్పందిస్తూ... రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని, న్యాయం చేయాలని తాము కోరుతుంటే.. మరోవైపు కనీసం నిధులివ్వకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తే ఎలా కుదురుతుందని నిలదీశారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు మిగతా అంశాలు కూడా ప్రధానమైనవేనని అన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
Special Category Status

More Telugu News