Tollywood: రష్యా యువకుడితో మార్చిలో నటి శ్రియ వివాహం?

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటి శ్రియ శరణ్  త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. రష్యన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రికోచివ్ ని శ్రియ వివాహమాడుతుందని సమాచారం. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో శ్రియ-ఆండ్రికోచివ్ పెళ్లి ఘనంగా జరగనుందని, మూడు రోజుల పాటు ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మార్చి 17,18, 19 తేదీల్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇదిలా ఉంచితే, ఇటీవల తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను శ్రియా ఖండించిన విషయం తెలిసిందే. ఇటీవల షాపింగ్ చేసిన విషయమై శ్రియను ప్రశ్నించగా, తన స్నేహితురాలి వివాహం ఉండటంతో షాపింగ్ చేశామే తప్ప, తన పెళ్లి కోసం కాదని చెప్పింది. అయితే, శ్రియా పెళ్లి రష్యా యువకుడితో జరుగుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో మళ్లీ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా వార్తలపై శ్రియ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Go Back to Shorts
Tollywood
shriya

More Telugu News