Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దంపతుల వెడ్డింగ్ యానివర్శరీ.. అభినందనల వర్షంలో ముంచెత్తిన సెలబ్రిటీలు!

షార్ట్స్‌లో చూడండి
నిన్న వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను, పలువురు టాలీవుడ్ ప్రముఖులు, నటీ నటులు, నిర్మాతలు, అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను 1980 ఫిబ్రవరి 20వ తేదీన చిరంజీవి వివాహం చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. నిన్నటికి వీరి జంట ఒకటై 38 సంవత్సరాలు.

ఇటీవలే షష్టిపూర్తి కూడా చేసుకున్న చిరు, సురేఖలు, గత రాత్రి తమ ఇంట ప్రత్యేక విందును బంధుమిత్రులకు ఏర్పాటు చేశారు కూడా. 1979లో పునాదిరాళ్లు చిత్రంతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనతికాలంలోనే మెగాస్టార్ గా అవతరించి, ఎందరికో స్ఫూర్తిమంతంగా నిలిచి, 150 చిత్రాలను పూర్తి చేసిన చిరంజీవి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాల్లో పలువురు పోస్టులు పెడుతున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Surekha
Marriage Anniversary

More Telugu News