ఓ ఇంటివాడు అవుతోన్న కమెడియన్ ప్రియదర్శి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ ఇంటివాడు అవుతోన్న కమెడియన్ ప్రియదర్శి

  • నటుడిగా బిజీ అయిన ప్రియదర్శి
  • కమెడియన్ గా ఎక్కువ మార్కులు
  • రిచా అనే నార్త్ ఇండియన్ అమ్మాయితో వివాహం  
ఈ మధ్య కాలంలో యంగ్ కమెడియన్ గా బాగా పాప్యులర్ అయినవారి జాబితాలో ప్రియదర్శి కనిపిస్తాడు. చాలా తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఆయన, యువ కథానాయకుల సినిమాల్లో చకచకా అవకాశాలు కొట్టేస్తున్నాడు. పాత్ర ఏదైనా నవ్వులు పూయిస్తూ క్లాప్స్ కొట్టించేస్తున్నాడు.

అలాంటి ప్రియదర్శి త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఆగ్రాలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ నెల 23వ తేదీన 'రిచా'తో ఆయన వివాహం జరగనుంది. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ లోని నరేన్ గార్డెన్స్ లో భారీస్థాయిలో రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తున్నారు. టాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖులు వివాహానికి హాజరుకానుండగా, మరికొందరు రిసెప్షన్ కి హాజరవుతారని సమాచారం.    
priyadarshi

More Telugu News