ఇళయరాజాను కలిసి 'సైరా' టీమ్ లో చేరాలని కోరిన చిరంజీవి!
- స్వయంగా వెళ్లి ఇళయరాజాను కలిసిన చిరంజీవి
- 'సైరా'కు మ్యూజిక్ డైరెక్టర్ గా చేయాలని కోరిక
- అంగీకరించిన మ్యూజిక్ మ్యాస్ట్రో
- వెలువడని అధికారిక ప్రకటన
ఇక ఇప్పుడు ఆయన పేరు కూడా పోయి, తాజాగా ఇళయరాజా పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల పద్మభూషణ్ పురస్కారానికి ఇళయరాజా ఎంపిక కాగా, ఆయన్ను అభినందించేందుకే చిరంజీవి వెళ్లారని కొందరు అంటుంటే, చారిత్రక నేపథ్యమున్న సినిమా కాబట్టి, బీజిఎం (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) కీలకమని, ఇళయరాజా అయితే బాగుంటుందని భావించిన చిరంజీవి ఆయన్ను కలిసి, ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక ఇళయరాజా కూడా అంగీకరించారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.